ఆంధ్రప్రదేశ్‌

మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల పూర్తిపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ఉదయం నగరంలోని ఒక హోటల్‌లో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) మేనేజింగ్ డైరెక్టర్ కే సాంబశివరావు, పౌరసరఫరాల శాఖ సీఈవో వేణులతో సమావేశమై రాష్ట్రంలో నిర్మించనున్న మూడు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కాకినాడ, కృష్ణపట్నంలో ఏర్పాటవుతున్న ఎంఎంఎల్‌పీ పనులు, నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న కృష్ణపట్నం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణంపై సమీక్షించిన మంత్రి గౌతమ్‌రెడ్డి త్వరలోనే జిల్లా కలెక్టర్‌తో సమీక్షించి రోడ్డు నిర్వహణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో మచిలీపట్నం కేంద్రంగా వెయ్యి ఎకరాల్లో ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టుపై కూడా సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఓఎన్‌సీఓఆర్ (కాంకర్) నెలకొల్పనున్న మల్లీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను వీలైనంతగా త్వరగా అందుబాటుకి తేవడం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా, వ్యాపార పరంగా మరింత ముందంజ వేయడానికి అవకాశముంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాలందిస్తామని తెలిపారు. మంత్రి సమీక్షలో అధికారులు వివరణ ఇస్తూ రూ.450 కోట్లతో విశాఖ విమానాశ్రయం సమీపంలో 108 ఎకరాల్లో నిర్మించిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఇటీవలే ప్రారంభమైందని, కాకినాడ ప్రాజెక్టు ప్రస్తుతం మొదటి దశలో ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పనుల పూర్తికి అవకాశముంటుందని తెలిపారు.