ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై దాడి కేసులో నిందితుడి బెయిల్ రద్దు :హైకోర్టు ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 19: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి జరిగిన ఘటనకు సంబంధించి శ్రీనివాసరావును నిందితునిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌పై బయట ఉన్నాడు. నిందితుడి బెయిల్ రద్దు చేయాలంటూ గత నెల 20వ తేదీన ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది.