ఆంధ్రప్రదేశ్‌

ఎందుకు పారిపోతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 19: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారంలేదని, అదేమని ప్రశ్నిస్తే సభ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. శాసనసభ ఆవరణలోని తన చాంబర్‌లో శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. పీపీఏలపై తప్పుడు సంకేతాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విశ్వసనీయత లేదన్నారు. వాస్తవాలను విస్మరించి మాట్లాడటం రివాజుగా మారిందని ధ్వజమెత్తారు. శాసనసభలో ఇష్టానుసారంగా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందన్నారు. వైఎస్ హయాంలోనే రూ. 25 వేల కోట్ల మేర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు. పోలవరం అంచనాలు పెరగటానికి కూడా ఆయన విధానాలే కారణమన్నారు. తమ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో భాగంగా సోలార్ పవర్ నుంచి విండ్ పవర్‌కు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల మేరకు యూనిట్‌కు రూ. 4.84 ధర నిర్ణయించారని ఇది కష్ట సాధ్యమని తాము కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వైఎస్ హయాంలో యూనిట్ రూ. 2.50 మాత్రమే ఉండేదని అలాంటి సమయంలో అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. సోలార్ పవర్‌తో పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్లామని పునరుత్పాదక విద్యుత్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు లైన్ నష్టాలు తగ్గించగలిగామన్నారు. అందువల్లే విద్యుత్ చార్జీలు పెంచలేదని, అవసరమైతే తగ్గిస్తామని తమ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చిందని గుర్తుచేశారు. పీపీఏలను సమీక్షిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి చార్జీలు తగ్గించబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. థర్మల్ విద్యుత్‌కు అవసరమైన బొగ్గు రవాణాలో అవరోధాలు ఉన్నాయని దాన్ని నమ్ముకుంటే రాష్ట్రం అంధకారమవుతుందని హెచ్చరించారు. ఇది ప్రజలపై ధర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అన్నింటినీ సమతుల్యం చేసుకుంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. దీన్ని తప్పుపడుతూ విచారణ జరుపుతామనటంలో అర్థం లేదన్నారు. జగన్ కంపెనీ సండూరి పవర్స్‌కు మాత్రం అధిక చెల్లింపుల కోసం కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో వైఎస్ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగిందన్నారు. సీనయ్య, మధుకాన్ కంపెనీల టెండర్లను అప్పట్లో రద్దు చేశారని దీనివల్ల అంచనాలు పెరిగాయన్నారు. 2013లో మరోవిడత రూ. 2600 కోట్లతో టెండర్లు పిలిచి తిరిగి వాటిని కూడా రద్దు చేశారన్నారు. రద్దు వల్ల కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారని ఆ సంస్థలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేది కాదన్నారు. తమ హయాంలో 71 శాతం పూర్తి చేసిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. అప్పట్లో కేంద్రమంత్రి గడ్కరీ సూచనల మేరకే నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించామని ఇందులో ఏముందని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఎకరానికి రూ. 6.5 లక్షల ధర నిర్ణయిస్తే వైకాపా ప్రభుత్వం రూ. 10 లక్షలు చెల్లిస్తామని ఇష్టప్రకారం చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. శాసనసభలో విలువలకు గౌరవం లేకుండా పోయిందని ఇదే రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వమే చులకనవుతుందని స్పష్టం చేశారు.