ఆంధ్రప్రదేశ్‌

గ్రామ సచివాలయ నియామకాల ప్రక్రియ ఖరారుకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నియామక, పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఖరారు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని శుక్రవారం నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సభ్యులుగా పురపాలక, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్, అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఉంటారు. ఇందుకు సంబంధించిన నియామకం, విధులు, నియామక షెడ్యూల్, శిక్షణ తదితర అంశాలతో మరో ఉత్తర్వు జారీ చేసింది. సెప్టెంబర్ 30 నాటికి నియామకాలు పూర్తి చేసి, అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి రానుంది.