ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రుతుపవనాల ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్డాండు పరిసర ప్రాంతాల్లో జనం ఇబ్బందుల పాలయ్యారు. గుంటూరు జిల్లాలోని కర్లవాలెపాలెం, పిట్టలవాని పాలెం, బాపట్ల తదితర ప్రాంతాల్లో జోరుగా వానలు పడ్డాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజం, మార్టూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మార్టూరు మండలం పలమర్రులో ఓ పెంకుటిల్లు కూలిపోయింది. యద్దనపూడి మండలం యనమదలలో ఉప్పువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్థరాత్రి భారీ వర్షం పడింది.