ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’పై మండలిలో వాడివేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్ర శాసన మండలిలో పోలవరం ప్రాజెక్టుపై సోమవారం వాడివేడి చర్చ జరిగింది. అంచనాలను ఆమోదించిన అథారిటీపై కూడా విచారణ చేయిస్తారా అని టీడీపీ ప్రశ్నించగా, సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. పునరావాసాన్ని పూర్తిగా విస్మరించారని, నవంబర్ 1 నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల గురించి టీడీపీ సభ్యుడు అశోక్‌బాబు వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. దీనిపై మంత్రి వివరణ ఇస్తూ పోలవరం ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్ల రూపాయలుగా టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆమోదించిందన్నారు. దీనిపై అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రాజెక్టు అంచనాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. అంచనాలు ఆమోదించిన సంస్థపై కూడా విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు మాధవ్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్‌ను పక్కన పెట్టేశారని, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రాజెక్టు అంచనాలు పార్లమెంట్‌లో ఆమోదించారని, ప్రధాని మోదీ చెప్పాక కూడా అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మోదీ ఆమోదించారని ఎలా చెబుతారన్నారు. ఈపీసీ ఉండగా, 60 సి కింద పనులు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. పునరావాస చెల్లింపుల్లో ఇప్పటికే ఒకసారి చెల్లించిన వారికి మరోసారి చెల్లించారన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అనిల్ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఈపీసీ ప్రకారం 60సి కింద పనులు కేటాయించే వీలు లేదన్నారు. ఎడమ, కుడి కాలువ, హెడ్ వాటర్ వర్కుల అంచనాలు పెంచారన్నారు. పునరావాసాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేశారన్నారు. ఆ పని తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తయిఉంటే ప్రస్తుత వరద వల్ల 18 వేల కుటుంబాలు ముంపునకు గురైయ్యేవన్నారు. పునరావాసం పనలు చేపట్టలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని అంటున్నారని, కానీ ఆగదని స్పష్టం చేశారు. జూన్ 2021 నాటికి పూర్తి అవుతుందని, వర్షాకాలం తరువాత నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాజెక్టులో అవకతవకలపై కమిటీ వేశామని, మరో వారం రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. సిమెంట్, స్టీల్ కొనుగోళ్లపై ఆడిట్ జరగలేదని, ఒక ప్రాజెక్టుకు 8 శిలాఫలకాలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టుకు చేసిన ఖర్చులపై నిజాలను నిగ్గుతీయనున్నామన్నారు.