ఆంధ్రప్రదేశ్‌

అమరావతిని భ్రమరావతి అన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వాకం వల్లే రాజధాని అమరావతికి రుణం మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంక్ వెనక్కు తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. అమరావతిని భ్రమరావతి అంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. సోమవారం శాసనసభలో ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన ఉపసంహరణ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తమపై నమ్మకంతో స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి 33వేల 500 ఎకరాలు అందించారని, ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్పందించారన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో భూములే పెట్టుబడిగా అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం తమపై నమ్మకంతో ఉచితంగా అందించిందని తెలిపారు. రాజధాని భూ సమీకరణ జరుపుతున్న సమయంలో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైకాపా రైతుల్ని రెచ్చకొట్టే ప్రయత్నాలు చేసిందని, అయితే రైతులు తమ వెంటే అడుగేసినందున రాజధాని నిర్మాణం సాధ్యపడిందన్నారు.
రైతుల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు పొలాలు సైతం తగులబెట్టి ప్రపంచ బ్యాంక్‌కు తప్పుడు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. రాజధాని భూ సమీకరణ.. పేరు.. డిజైన్లు అన్నీ పక్కా ప్రణాళికతో రూపొందించామన్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్మాణాలు జరిపామన్నారు. అమరావతికి వైకాపా వ్యతిరేకమని, మొదటి నుంచి అడ్డుకుంటోందని విమర్శించారు. రాజధానిపై సమగ్రంగా చర్చించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము నిర్మించిన శాసనసభ, సచివాలయంలోనే కూర్చుని అభియోగాలు మోపుతున్నారని ఆక్షేపించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్‌తో ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు.
ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఏషియన్ ఇన్‌ఫ్రా బ్యాంక్ అమరావతి నిర్మాణానికి ముందుకొస్తే కావాలనే దొంగ మెయిల్స్ పంపారని దుయ్యబట్టారు. వైకాపా అడ్డుకుంటోందని, తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని తెలిసినా అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు చేపట్టకపోతే ఇప్పుడు ఎక్కడ కూర్చునే వారని నిలదీశారు. సీఎం క్యాంప్ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయకపోతే ఇప్పటికిప్పుడు రాజ్‌భవన్ ఎలా కట్టేవాళ్లని ప్రశ్నించారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతి నిర్మాణం చేపట్టామన్నారు. అమరావతి పాలనా నగరం కాదని చెప్తూ అన్ని రంగాల్లో అభివృద్ధికి నిర్దేశించిందని వివరించారు. ప్రపంచ బ్యాంక్ జోక్యంపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. అమరావతిపై ఉన్న నమ్మకంతో రూ. 4వేల కోట్ల విడుదలకు ముందు మరోసారి విచారణ జరిపిందని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం అమరావతిని భ్రమరావతని అవహేళన చేస్తూ పనులు నిలిపివేసినందున భూముల ధరలు గణనీయంగా తగ్గాయని రైతులు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధికి చిత్తశుద్ది ఉంటే వైకాపా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.