ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ఎంసెట్ కౌనె్సలింగ్: మంత్రి ఆదిమూలపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: రాష్ట్రంలో ఎంసెట్ కౌనె్సలింగ్ త్వరలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగా 1998, 2008, 2012, డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పట్ట్భద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తమ దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వివిధ కారణాల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిటీ నివేదిక ప్రకారం 1998లో 4534 మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్తూ కమిటీ సూచనల మేరకు 36 మందిని అర్హులుగా గుర్తించామని వీరిలో ఆరుగురు అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తయి పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. డీఎస్సీ-2008 డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు 30, 70 శాతం కేటాయింపు వల్ల నష్టం జరిగిందని కమిటీ నివేదిక ఆధారంగా 4657 మందిని గుర్తించగా 3636 మంది ఆ తరువాత డీఎస్సీలో ఉద్యోగాలు పొందారన్నారు.
డీఎస్సీ 2012లో లోకల్, నాన్‌లోకల్ వల్ల నష్టపోయిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వీరిని ఎస్జీటీ కింద పరిగణించి టైమ్ స్కేల్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌ను సంప్రతించాలని సూచించారు. ఇక 2018 డీఎస్సీ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సర్ట్ఫికెట్ల పరిశీలన అనంతరం నియామకపు పత్రాలు అందజేస్తామన్నారు. వచ్చే డీఎస్సీలో తప్పులు దొర్లకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి డీఎస్సీతో భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యా సంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాజీపడే ప్రసక్తిలేదన్నారు. త్వరలోనే ఎంసెట్ కౌనె్సలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు జరుపుతున్నామని చెప్పారు. ఫీజుల నియంత్రణపై ప్రతిపాదించిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌పై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా బోధన చేసే వారి విషయంలో ఆంగ్లం ఒక సబ్జక్ట్‌గా గుర్తింపు ఉన్న వారికి డీఎస్సీలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే యోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు.