ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర గిరిజన వర్సిటీకి ఆదిలోనే హంసపాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 23: విజయనగరం పట్టణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిది కోర్సులకు సంబంధించి హడావుడిగా ప్రవేశాలు నిర్వహించినప్పటికీ, ఇప్పటి వరకు తరగతులు మొదలు కాలేదు. తరగతులు ఏర్పాటు చేస్తారా? లేదా ప్రవేశాలను రద్దు చేస్తారో అర్ధంకాని పరిస్ధితి నెలకొంది. ఈ ఏడాది ఎలాగైనా కేంద్ర గిరిజన వర్శిటీలో ప్రవేశాలు నిర్వహించి తరగతులు మొదలు పెట్టాలని కేంద్రం పట్టుబడినప్పటికీ ఆచరణలో మాత్రం అధికారులు తాత్సారం చేస్తున్నారు. విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దానికి సంబంధించి 526 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దానికి ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. ఇదిలావుండగా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో గిరిజన వర్శిటీకి రూ.420 కోట్లు కేటాయించారు. ఇదిలా ఉండగా కేంద్ర గిరిజన వర్శిటీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మారిపోవడంతో కథ అడ్డం తిరిగింది. కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ కేంద్ర గిరిజన వర్శిటీ తరగతులు నిర్వహించేందుకు సరైన నిర్ణయం తీసుకోకపోవడం, కేంద్రం నుంచి అనుమతులు రావాలని తాత్సారం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతులు నిర్వహిస్తారో, లేదోనని మదనపడాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తరగతులను నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు.