ఆంధ్రప్రదేశ్‌

విద్య ప్రపంచానే్న మార్చేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, ఆగస్టు 16: సమాజం అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యం అని, విద్య ప్రపంచానే్న మార్చేస్తుందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం డా.అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం అని అన్నారు.
ఉర్దూ భాష అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. బడ్జెట్‌లో విద్యకు 10 శాతం కేటాయించినా దాన్ని 17.5 శాతానికి పెంచామన్నారు. అలాగే రూ.21 వేల కోట్ల నిధులు కేటాయించి విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రేపటి పౌరులుగా విద్యార్థులను తీర్చిద్దిదేందుకు సిబిసిఎస్ విధానం ప్రవేశపెట్టి నైతిక విలువలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతించారని, కడపలో వౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం అనుబంధ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ నాలెడ్జ్‌హబ్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంటా చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఇ.కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, ఇంచార్జి వైస్ ఛాన్సిలర్ ఆచార్య వై.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి
గంటా శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి, ఎంపి టిజి.వెంకటేష్