ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 24: రాయలసీమలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకురానుందని రాష్ట్ర డిజిపి జెవి రాముడు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి టాస్క్ఫోర్స్, సిసి కెమెరాలు, డాగ్‌స్వ్కాడ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిజిపి రాముడు గురువారం కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి ఉక్కుపాదం మోపామన్నారు. గత 12 సంవత్సరాలుగా స్మగ్లర్లపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశామని, అయితే ఒక్కరికి కూడా కోర్టుల్లో శిక్ష పడలేదన్నారు. పిడి యాక్టు వల్ల కొంతకాలం జైలులో మాత్రమే ఉంచగలిగామన్నారు. చట్టంలోని లోపాల వల్ల స్మగ్లర్లు తప్పించుకుంటున్నారని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తచట్టం తీసుకురాబోతోందన్నారు. కొత్త చట్టం అమలైతే ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఒకసారి ఒక వ్యక్తి పట్టుబడితే ఐదేళ్లు, రెండవ సారి పట్టుబడితే పదేళ్లు జైలుశిక్ష పడుతుందన్నారు. సిసి కెమెరాలు, బేస్ క్యాంప్‌లు, డాగ్ స్వ్కాడ్ వంటి పటిష్టమైన చర్యలతో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టిస్తామన్నారు. తమిళ కూలీల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే తిరుపతిలో తమిళనాడు అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించామన్నారు. మద్రాసులోని రెడ్‌హిల్స్ ప్రాంతాన్ని అదుపులోకి తెస్తామని, ఇప్పటికే కర్నాటకలోని కటిగణహళ్లి స్మగ్లర్లు ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. ఇసుక మాఫియాలో ఎవరున్నా సహించేది లేదని, అధికారపార్టీ కానీ, ప్రతిపక్షం కానీ ఎవరైనా చట్టం దృష్టిలో సమానులే అన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామని తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, విశ్రాంత జడ్జి విచారిస్తున్నారన్నారు. సమావేశంలో డిజిపితో పాటు రాయలసీమ ఐజి గోపాలకృష్ణ, కర్నూలు డిఐజి రమణకుమార్, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు, అటవీశాఖ ఉన్నతాధికారి మూర్తి, తదితరులు ఉన్నారు.