ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో హెలికాప్టర్ సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 18: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీశైలానికి హెలిక్యాప్టర్ సర్వీసులు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శ్రీశైలం క్షేత్రానికి హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్ సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభించనున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హెలిక్యాప్టర్ సర్వీసులు నడుపుతున్నట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ హెలికాప్టర్ కంపెనీలతో చర్చించిన అనంతరం ఢిల్లీకి చెందిన సమ్మిట్ ఏవియేషన్ కంపెనీ సర్వీసుల నిర్వహణకు ఆసక్తికనబరిచిందన్నారు. తరువాత కూడా హెలిక్యాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి హెలిక్యాప్టర్ బయలుదేరి శ్రీశైలం చేరుకుంటుందన్నారు. ప్రయాణ సమయం 45 నిమిషాలు అని, ఒకవైపు టికెట్ ధర రూ.14,840గా నిర్ణయించారన్నారు. ప్రయాణంలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను ప్రయాణికులు వీక్షించవచ్చన్నారు. ప్రతిరోజు రెండు మూడు ట్రిప్పులు నడుపుతారన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మొదటి సర్వీసులో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, రెవెన్యూ ఎండోమెంట్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్, సమ్మిట్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భాటియా శ్రీశైలం చేరుకుంటారన్నారు.