ఆంధ్రప్రదేశ్‌

శాంతించిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : ఉగ్ర గోదావరి శాంతించింది. గత పది రోజులకు పైగా ఉభయ గోదావరి జిల్లాల వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన నది సాధారణ స్థితికి చేరుకుంటోంది. గత పది రోజులుగా పునరావాస కేంద్రాల్లోవున్న ముంపు బాధితులు ఇపుడిపుడే ఇంటి ముఖం పడుతున్నారు. వరద ముంపు నుండి మెల్లగా బయటపడుతున్న ప్రాంతాల్లో ఇపుడిపుడే నష్టాలు తేలుతున్నాయి. ఆస్తి నష్టం, పంట నష్టం భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. గోదావరి లంక గ్రామాలు ఇంకా తెప్పరిల్లలేదు. పంట పొలాలు, ఉద్యాన పంటలు ఇంకా నీటిలో నానుతూనే వున్నాయి. ఇటు ఏజెన్సీ, అటు లంక గ్రామాల్లో ముంపులో నానిపోయిన ఇళ్లు నెమ్మదిగా కూలుతున్నాయి. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసి భక్తుల దర్శనార్ధం సిద్ధంచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 5వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనావేశారు. ఇంకా పొలాల్లో వరద నీరు వుండటంతో పంట నష్టం సర్వే మొదలు కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో రకరకాల తోటలు పూర్తిగా నష్టపోయాయి. కూరగాయలు, ఆకుల కూరల తోటలు బురద మయంగా మారాయి. వరి పొలాలు ఇంకా నీటిలోనే వున్నాయి. ఉద్యాన పంటలు మట్టికొట్టుకు పోయాయి.
వరద నీటిమట్టం భారీగా తగ్గినా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో మామూలు పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. వరద తగ్గినా గిరిజన గ్రామాలకు వెళ్లే దారిపొడవునా బంకమట్టి ఏర్పడటంతో ప్రస్తుతానికి రోడ్డు మార్గానికి అవకాశం లేదు. అధికారులు మిషన్లతో బురదను తొలగిస్తే 19 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే స్పిల్ ఛానల్‌లో నిండివున్న నీటిని బయటకు తోడించాల్సిన ఉంటుంది. గోదావరి నది ఎగువ ప్రాంతంలో వరద నీటి మట్టాలు తగ్గు ముఖం పట్టాయి. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 33 అడుగులకు మట్టం తగ్గింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 9.5 అడుగుల మట్టంలో 5.58 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడిచి పెట్టారు. గేట్లను 1.08 మీటర్ల మేరకు ఎత్తి, నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం వద్ద 7.71 మీటర్లు, పేరూరు వద్ద 9.87, దుమ్ముగూడెం వద్ద 9.81, కూనవరం వద్ద 13.33, కుంట వద్ద 6.34, కొయిదా వద్ద 18.14, పోలవరం వద్ద 11.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.22 మీటర్ల నీటి మట్టంలో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
చిత్రాలు.. తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ముంపుతో కుళ్లిపోయిన అరటి తోట..
*వరద తగ్గడంతో సాధారణ స్థితికి చేరుకున్న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్