ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం మరో ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకై అన్ని కార్మిక సంఘాలతో కలసి మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని గుర్తింపు కార్మిక సంఘ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షులు వైవి రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. మంగళవారం నాడిక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1168 కారుణ్య నియామకాల ద్వారా జూన్ లేదా జూలై మాసాల్లోనే ఉద్యోగులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించి సంవత్సరాంతానికల్లా అందరికీ ఉద్యోగాలు ఇస్తామని జూన్ 12వ తేదీ సీఎం జగన్, రవాణా మంత్రి పేర్ని నానిల సమక్షంలో జరిగిన చర్చల్లో వచ్చిన హామీ మేరకు నాడు తాము సమ్మెను విరమించామన్నారు. అయితే నేటి వరకు అసలు ఆ ప్రక్రియ ప్రారంభించ లేదన్నారు. అలాగే సీఎం జగన్ తన కడప పర్యటనలో గత ప్రభుత్వం అదనపు సిబ్బంది పేరిట తొలగించిన వంద మంది డ్రైవర్లు, కండక్టర్‌లను తిరిగి నియామిస్తానన్న హామీని కూడా నెరవేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది కండక్టర్లు, 600 మంది డ్రైవర్లు తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాల నుంచి బలవంతంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను మాత్రం విధుల్లోకి తీసుకోకుండా ఉన్న వారితోనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల సొసైటీ సొమ్ము దాదాపు రూ.420 కోట్లను యాజమన్యం తన వద్ద ఉంచుకోని కనీసం రిటైరయిన ఉద్యోగులకు ఈ నెల చెల్లించాల్సిన ఎస్‌ఆర్‌బీఎస్ పెన్షన్‌ను కూడా ఇంకా చెల్లించకపోవడంతో దాదాపు 22 వేల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాగే తమ సొసైటీకి చెల్లించాల్సిన రూ.250 కోట్లు వెంటనే చెల్లించి పెండింగ్‌లోని రుణాలను వెంటనే చెల్లించాలని దామోదరరావు డిమాండ్ చేశారు.