ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ ఉద్యోగార్థులకు 22 నుండి హాల్‌టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 13: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 22వ తేదీ నుండి హాల్‌టిక్కెట్లను అందజేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. ఈ ఉద్యోగాల కోసం రాష్టవ్య్రాప్తంగా దరఖాస్తులు పెద్ద ఎత్తున అందాయని అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి లక్షా 33 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటీఫికేషన్ జారీ చేశామని చెప్పారు. ఇందుకు గాను దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 22 లక్షల 73 వేల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుండి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటాయని, టెక్నికల్ సబ్జెక్టు పేపర్లు మాత్రం ఇంగ్లీషులోనే ఉంటాయని తెలిపారు.
మొదటి రోజు 12 లక్షల 50 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు గాను రాష్టవ్య్రాప్తంగా 6 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ టీవీ, వీడియో కవరేజ్ వంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపల్ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజీ ఇస్తున్నామని, 150 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం ఉంటుందని, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారని వివరించారు. నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి నాలుగు తప్పుడు సమాధానాలకు ఒక మార్కు నష్టపోతారనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించారు. అలాగే అభ్యర్థులకు ఎక్కడ ఉద్యోగం వస్తే ఆ ప్రాంతంలోనే నివశించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా గ్రామాలు, వార్డులు కేటాయిస్తామని కమిషనర్ గిరిజాశంకర్ స్పష్టంచేశారు.