ఆంధ్రప్రదేశ్‌

వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 14: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, వౌలిక సదుపాయాల దిశగా మరింతగా కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ త్వరలో భర్తీచేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని మంత్రి ఆదిమూలపు సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదలకు పూర్తిస్థాయిలో విద్యను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తారన్నారు. వీటిలో అమ్మ ఒడి పథకంలో భాగంగా పాఠశాలలకు వెళ్ళే ఆడపిల్లలకు రూ.15 వేలు అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 17 విశ్వవిద్యాయాలను ‘ఎ’ గ్రేడ్ వచ్చే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో 16 శాతం అంటే రూ.33 వేల కోట్లు విద్యకు కేటాయిస్తామన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు వృత్తి విద్యానైపుణ్యంలో శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా మెరుగైన విద్య అందిస్తామన్నారు. పేద విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఫీజులు కూడా చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి కేటాయించిన నిధులు ఇంకా రావాల్సివుందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి సురేష్‌వర్మ తమ దృష్టికి తీసుకొచ్చారని, దానిపై దృష్టిపెడతామని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు. నన్నయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ 2006లో ఏర్పడిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి పూర్తి సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఈ విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసే విధంగా చూడాలన్నారు.
విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఛాంబర్‌లో అధ్యాపకులను మంత్రికి పరిచయం చేశారు. అంతకు ముందు ప్రాంగణంలోని నన్నయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం, ఆర్జేడీ ఆర్ నరసింహరావు, ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.