ఆంధ్రప్రదేశ్‌

కలగా మిగిలిన మహాత్ముడి నామకరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఆగస్టు 14: క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్ వద్ద రైలు బండి దిగిన జాతిపిత మహాత్ముని రాకకు గుర్తుగా ఈ రైల్వే స్టేషన్‌కు ఆయన పేరు పెట్టాలన్న ప్రతిపాదన 30 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్రోద్యమంలో భాగమైన 1942 క్విట్ ఇండియా పోరాటంలో జిల్లా మీదుగా ఒడిశా వెళ్తున్న మహాత్ముని రాకను ఆనాటి బ్రిటీష్ పాలకులు ముందుగానే గుర్తించి శ్రీకాకుళం రైల్వే రోడ్ సమీపంలో ఉన్న దూసి రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారని పలువురు స్వాతంత్య్రోద్యమకారులు తెలిపారు. ఆనాటి బ్రిటీష్ పాలకుల తీరుకు గాంధీతో పాటు పలువురు ఉద్యమకారులు నిరసన తెలియజేసి అనంతరం ఉత్తరాంధ్రలో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమకారులతో మహాత్మగాంధీ కొద్దిసేపు ముచ్చటించారని ఇక్కడి స్వాతంత్య్ర సమరయోధులు తెలిపారు. ఆనాటి స్వాతంత్య్రోద్యమ తీవ్రతను, లక్ష్యాలను, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమ ఘట్టాలపై జాతిపిత దూసి రైల్వేస్టేషన్‌లో స్వాతంత్య్ర ఉద్యమకారులతో కొద్దిసేపు ముచ్చటించారని ఈ ప్రాంత సమర యోధులు తెలిపారు. అప్పుడు జాతిపిత దూసి రైల్వేస్టేషన్ రాకకు గుర్తుగా ఆనాటి కొందరు స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి రైల్వే బుకింగ్ పక్కన మహాత్ముడి చేతుల మీదుగా ఒక మర్రి మొక్కను కూడా నాటించారని సమరయోధులు తెలిపారు. ఈమొక్క ప్రస్తుతం భారీ వృక్షంగామారి ఊడలు కూడా వృక్షాలుగా మారడంతో పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. కానీ, జాతిపిత మహాత్ముడి పేరును రైల్వే స్టేషన్‌కు నామకరణం చేయాలన్న ఇప్పటి నేతలు, రైల్వే అధికారుల ప్రతిపాదన మాత్రం కలగానే మిగిలిపోయింది.