ఆంధ్రప్రదేశ్‌

నేను సీఎం జగన్ సైనికుడ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 16: నేను సీఎం జగన్మోహన్ రెడ్డి సైనికుడిని... నావద్దా బాణాలున్నాయి. అయితే కొండపైకి వెళితే అక్కడ పవిత్రతను కాపాడటమే లక్ష్యం.. అందుకే అక్కడ రాజకీయాల గురించి మాట్లాడను. కొండ దిగితే నా వద్ద కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు పదునైన బాణాలుంటాయి. నేను ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక మాట్లాడటం మానేశానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తాను సినీరంగంలో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డానన్నారు. సీనియర్ క్యారెక్టర్ నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తనకు సినీరంగంలో జన్మనిచ్చిన తండ్రని, ఆయన ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిదన్నారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు పర్యటించానని చెప్పారు.
ఈసందర్భంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని శ్రీవారికి మొక్కుకున్నానన్నారు. సినిమాల్లో పాడాలనుకున్నా తనకు అవకాశం రాలేదని, అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం నాడు నేను పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయని చెప్పారు. జూలై 27న తిరుమలకు నడుచుకుంటూ వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆనాడే ఎస్వీబీసీ చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. శ్రీకాళహస్తిలో ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలో తరచుగా శ్రీకాళహస్తీశ్వరుని, అమ్మవారిని దర్శించుకునే వాడినని, అప్పటి నుంచి నాలో పెరిగిన దైవ భక్తి కారణంగానే నేడు శ్రీవారి చెంత పనిచేసే భాగ్యం లభించడం తన అదృష్టంగా పృథ్వీరాజ్ చెప్పారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం ఆ పవిత్రతకు భంగం కలిగంచడమేనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే మీడియా వారించాలని కూడా సూచించారు. అందుకే తాను కొండపైన ఉన్నంత వరకు రాజకీయాల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. కొండదిగితే మాత్రం తాను జగన్ సైనికుడినేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. శ్రీవారి మీద భక్తి, సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా తన బాధ్యతలను నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. నెలలో 20 రోజులు తిరుపతిలోనే ఉంటానని, అందుకే తన ఓటరు కార్డు, రేషన్ కార్డు రెండూ తిరుపతికి మార్చుకున్నానని ఎస్వీబీసీ చైర్మన్ వెల్లడించారు. అన్నమయ్య సంకీర్తనాలపనలో స్థానికులకు అవకాశం కల్పించడం, నాదనీరాజనంలో ప్రతిభ ఉన్న కళాకారులకు అవకాశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీసీ మాజీ చైర్మన్‌పై కక్ష సాధింపు ఉండదన్నారు. స్వామివారి హుండీ నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు అందుకు తగ్గట్టుగా పనిచేయాలని మాత్రమే తాను కోరుకుంటానన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వామివారి భక్తులు, ప్రజలు వద్దకు తీసుకువెళ్లేందుకు తాము సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న రాఘవేంద్ర రావు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరని, ఆయన అనుకుని ఉంటే ఆనాడే ఎస్వీబీసీ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు ఆనందంగా ఉండేవన్నారు. తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకునైనా 270 మంది ఎస్వీబీసీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.
తనపై ఉన్న నమ్మకంతో ఉద్యోగులు తమ రెండు కార్మిక సంఘాలను సైతం రద్దు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వాళ్ల కళ్లలో ఆనందం చూడటమే తన ధ్యేయమన్నారు. ఎస్వీబీసీ ప్రసారాలు తెలుగు, తమిళం, కన్నడంలోనే ప్రసారం అవుతున్నాయని, ఉత్తరాది వారికి కూడా ఎస్వీబీసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హిందీలో ఎస్వీబీసీ ప్రసారాలను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చైర్మన్ పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. సరస్వతీ పుత్రుడైన చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాల సీడీలను మూలనపడేసి ఆయనకు అన్యాయం చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు కూడా ఆదేశించామన్నారు. ఇందులో అక్రమాలు బయటపడితే అందుకు కారకులైన వారి నుంచి సీడీల తయారీకి అయిన రూ. 25లక్షల వసూలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయన్ను ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.