ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ నుండి క్షేత్రస్థాయి పర్యటనలు జనసేనాని పవన్‌కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధ్యయన బృందాల్లో 30 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ నాటికి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతుందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అధ్యయనం చేయనున్నామన్నారు. సెప్టెంబర్ మాసాంతానికి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలన్నీ పూర్తిచేసి అన్ని నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ నుండి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తామన్నారు. పార్టీ ఓటమిపాలైనా కార్యకర్తల్లో ధైర్యం ఏ మాత్రం సడలలేదని, అందుకు సమావేశాలకు హాజరవుతున్న సంఖ్యను చూస్తుంటే అర్ధమవుతుందన్నారు. కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతుందని, వారికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో న్యాయ విభాగాన్ని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ నాయకులకు సూచించారు.
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు
విజయవాడ, మచిలీపట్నం, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జిలను నియమిస్తూ జనసేనాని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి పోతిన మహేష్, విజయవాడ ఈస్ట్‌కు బత్తిన రాము, మైలవరానికి అక్కల రామ్మోహనరావు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం అసెంబ్లీకి బండి రామకృష్ణ, అవనిగడ్డకు ముత్తంశెట్టి కృష్ణారావు, పెడనకు అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌లను నియమించారు.