ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ దాడులు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు సరికాదని, ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడితే టీడీపీకి పట్టిన గతే 2024 ఎన్నికల్లో వైసీపీకీ పడుతుందని హెచ్చరించారు. పల్పాడులో కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురజాలలో ధర్నా చేపట్టేందుకు సిద్ధమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈనెల 26వ తేదీకి వాయిదా వేశామని, త్వరలోనే డీజీపీని కలిసి పరిస్థితులను వివరిస్తామని తెలిపారు. పలువురు వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా తమవద్దకు వచ్చి పనులు చేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాం కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అవినీతిని వెలికితీశారు, మైనింగ్ అక్రమాలను ఏ మేరకు అరికట్టారంటూ నిలదీశారు. కేవలం మైనింగ్ అక్రమ రవాణా పేర్లు మాత్రమే మారాయని, జరిగేదంతా మామూలేనని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. టీడీపీ వారైనా, వైసీపీ నేతలైనా తమ దృష్టిలో ఒకటేనని, ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబోదన్నారు. కాగా, ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ గుంటూరు నగరంలోని మెడికల్ కళాశాల వసతిగృహం వద్ద మట్టితో తయారు చేసిన 30 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కన్నా తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ భారీ ప్రతిమను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. పవిత్రమైన గంగానది వద్ద నుండి తెచ్చిన మట్టితో, కోల్‌కతాకు చెందిన కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని తయరు చేశారన్నారు. వినాయక చవితి ముందురోజు 2 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, అడపా శివనాగేంద్రం, కంచర్ల ఆంజనేయులు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, మాణిక్యవేల్ తదితరులు పాల్గొన్నారు.