ఆంధ్రప్రదేశ్‌

నా ఇల్లు మునిగితే చూద్దామనుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఒకవైపు వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, తన ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని రాష్ట్ర మంత్రులు చూస్తున్నారంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు. తన ఇంటిమీద పెట్టిన శ్రద్ధ, వరదలపై పెట్టి ఉంటే ప్రజలకు ఇబ్బందులు తప్పేవన్నారు.
చంద్రబాబు ఇంటిని ముంచేయడానికి వైకాపా కుట్ర: లోకేష్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచేయడానికి వైకాపా మరో కుట్ర చేసిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విటర్‌లో విమర్శించారు. నాగార్జున సాగర్ నిల్వ సామర్థ్యం 590 అడుగులని, ఇప్పుడు 586 అడుగులే ఉందని తెలిపారు. అయినా ప్రకాశం బ్యారేజీ వద్ద అంత వరద ఎందుకు వచ్చిందంటే.. నాగార్జున సాగర్‌లోకి వస్తున్న వరద నీటి కంటే ఎక్కువ నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారని ఆరోపించారు. కృష్ణా నదికి 2009లో ఇంత కంటే పెద్ద వరద వచ్చిందని, అయినా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద 11 లక్షల క్యూసెక్‌లను దాటనీయలేదని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అని ప్రశ్నించారు. వరద నిర్వహణ తెలియకా లేక చంద్రబాబు ఇంటిని ముంచే కుట్రా అని ప్రశ్నించారు. ఈ కక్ష సాధింపులో ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విమర్శించారు.