ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలపై గవర్నర్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. శుక్రవారం విజయవాడ గుణదలలోని కొత్త ప్రభుత్వాసుపత్రి సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పి నాంచారయ్య, వైద్యాధికారులు, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. గవర్నర్ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు.
అనంతరం ఆయన ఆసుపత్రిలోని అనెస్తీషియాలజీ, సాధారణ శస్త్ర చికిత్స విభాగం,, పాథాలజీ, రేడియాలజీ విభాగాలను, బ్లడ్ బ్యాంకును పరిశీలించి సంబంధిత విభాగాల అధిపతులు, డాక్టర్ శివవంకర్, డాక్టర్ శైలాబాల, డాక్టర్ లంకేశ్వరి తదితరులను ఆయా విభాగాల ద్వారా అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలు ఎల్లవేళల అందుబాటులో ఉంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి నాంచారయ్యకు సూచించారు. గవర్నర్ సర్జికల్ జనరల్ వార్డును సందర్శించిన సమయంలో అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గవర్నర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో వౌలిక సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి నిర్వహణ తీరు బాగుందన్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని రోగులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ వెంట గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఏపీహెచ్‌ఎంఐడీసీ ఈఈ ప్రవీణ్‌రాజు, రాజ్‌భవన్ అధికారులు, ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.