ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలకు జాతీయ ప్రచారమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోన్న కృష్ణా పుష్కరాలకు, ఆ స్థాయిలో ప్రచారం దక్కని వైనం సర్కారుకు అసంతృప్తి కలిగిస్తోంది. ముఖ్యంగా జాతీయ మీడియాలో కృష్ణా పుష్కరాలకు తగిన ప్రచారం లభించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రతి చిన్న విషయాన్ని భుజాన వేసుకుని, అంతా తానై వ్యవహరించిన చంద్రబాబు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపి మీడి యా వరకూ ప్రచారం ఫర్వాలేదని, ‘సాక్షి వంటి పత్రికలో కూడా పుష్కరాల ఏర్పాట్లపై వ్యతిరేకకథనాలు రావడం లేదంటే మనం ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నామో అర్ధమవుతోంద’ని చంద్రబాబు ఇటీవల పుష్కర సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, జాతీయ మీడియాలోనే సరైన ప్రచారం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ నుంచి కొందరు తెలుగు మీడియాకు చెందిన వారిని తీసుకువచ్చినా, పెద్దగా ప్రయోజనం లేదని, ఢిల్లీలో ఉన్న చానెళ్లు, పత్రికలు ఇక్కడే ఉండగా మళ్లీ అక్కడి నుంచి బెజవాడకు తెలుగు మీడియాను తీసుకురావడం వల్ల, ప్రభుత్వ ధనం వృధా తప్ప మరొకటి కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా ఢిల్లీ నుంచి వచ్చిన తెలుగు మీడియాకు సంబంధించిన వారిలో ఒకరిద్దరు మినహా, మిగిలిన వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు.
తాజాగా ఢిల్లీ నుంచి జాతీయ మీడి యా పేరుతో తీసుకువచ్చిన వారిలో ఇద్దరు మాత్రమే ప్రముఖులని, మిగిలిన మీడియా సంస్థల పేర్లు, ఉనికి ఎవరికీ తెలియదంటున్నారు. వారిని తాము తీసుకురాలేదని, పైగా వారిని సీఎంతో భేటీ వేయించడం సమాచార శాఖ అధికారులకు మింగుడుపడటం లేదు. జాతీయ స్థాయి మీడియా దిగ్గజాలను సీఎంతో కలిపించి ఉంటే ఆయన స్థాయి కూడా పెరిగేదంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే జాతీయ మీడియా, జర్నలిస్టులు ప్రముఖులయి ఉండాలని, ఆ స్థాయిలో ఉం టేనే తగిన ప్రచారం లభిస్తుందంటున్నారు. కానీ బెజవాడకు వచ్చిన వారిలో అలాంటి వారెవరూ తమకు కనిపించలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికితోడు ఢిల్లీలో సుదీర్ఘకాలం పనిచేసి సమాచారశాఖలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఉన్నా, వారికెవరికీ ఆ బా ధ్యత అప్పగించలేదని చెబుతున్నారు. జాతీయ మీడియా ఆహ్వానాలను నంలో అనుభవం ఉన్న వారికి బాధ్యత అప్పగించకపోవడం వల్లే, కృష్ణా పుష్కరాలకు సీఎం ఆశించిన స్థాయిలో జాతీయ స్థాయి ప్రచారం లభించడం లేదని సమాచారశాఖ అధికారులు విశే్లషిస్తున్నారు.