ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద క్షణక్షణానికి కృష్ణానది వరద తీవ్రత గణనీయంగా తగ్గుతోంది. ఆదివారం రాత్రి 10గంటల సమయానికి 6లక్షల క్యూసెక్కుల నీరు నేరుగా సముద్రంలోకి వెళుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 18వేల క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలన్నీ నిండుకుండలా పారుతున్నాయి. బ్యారేజీ 70గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి ఉంచి వస్తున్న వరదను వచ్చినట్లే దిగువకు వదలుతున్నారు. ఇదే సమయానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే బ్యారేజీకి చేరుతోంది.
మానవ తప్పిదమే: దేవినేని ఉమ
కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంతాలు వరద నీటి ముంపునకు గురికావడానికి మానవ తప్పిదమే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దీనిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం, జలవనరుల శాఖలకు దీనిపై ఫిర్యాదు చేసి న్యాయవిచారణ కోరతామని చెప్పారు. వరద గేట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కును ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి ఉమా ప్రశ్నించారు.