ఆంధ్రప్రదేశ్‌

సంకేతం, సందేశం, భావుకతల కలయికే ఫొటోగ్రఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ఆగస్టు 18: సంకేతం, సందేశం, భావుకతల కలయికే ఫొటోగ్రఫీ రంగమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటో కాంటెస్ట్‌లో ప్రతిభ చూపిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తమ్మినేని సీతారాం ప్రారంభించి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తన చిన్ననాటి నుంచి కళాశాల స్థాయి వరకు తన వెంట ఎప్పుడూ కెమెరా ఉండేదన్నారు. అయితే తాము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన ముందు కెమెరా ఉంటోందన్నారు. మనిషి హృదయాలను కదిలించే శక్తి ఫొటోలకే ఉందన్నారు. అడవుల్లోని ఎన్నో ప్రకృతి దృశ్యాలను మనం అక్కడకు వెళ్లి చూడలేమని, వాటిని మన కళ్లకు కట్టినట్లుగా ఫొటోల రూపంలో చూడగలుగుతున్నామన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సీఈవో ఏ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఒకే దృశ్యాన్ని ఒక్కో వ్యక్తి వేర్వేరు కోణాల్లో చూస్తారని, అప్పుడే వారిలోని సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. ఫొటోగ్రఫీ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఫొటోగ్రఫీ 110 రంగాల్లో ఇమిడి ఉందన్నారు. ఈ రంగంలో నిపుణులను తయారుచేయాలనే ఉద్దేశ్యంతో పోటీలు నిర్వహించి ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఫొటోలు తీసిన నైనిటాల్ (ఉత్తరాఖండ్)కు చెందిన పద్మశ్రీ అనూప్ షాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.
వివిధ ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ చూపిన 33మంది ఫొటోగ్రాఫర్లను సత్కరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఫొటోగ్రఫీ అకాడమీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ చూపిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
చిత్రం...విజయవాడ డెక్కన్ క్రానికల్ ఫొటోగ్రాఫర్ నారాయణను అవార్డుతో సత్కరిస్తున్న
శాసన సభాపతి తమ్మినేని సీతారాం