ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల ఆందోళనలు పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం సరికాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉద్యోగాలు కోల్పోతున్న మహిళలు, నిరుద్యోగులు ఆందోళన చేపడుతుంటే ముఖ్యమంత్రి నివాసం వద్ద 144 సెక్షన్ విధించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. వేధించి, బాధించి, బెదిరించి ఉద్యోగులను తొలగించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం నివాసం వద్ద కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి ఆటలాడుకుంటున్నారని, అందుకు నిదర్శనం గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లింగంగుంట తండాకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త భూక్యా అజితాబాయి ఆత్మహత్యకు పాల్పడటమేనన్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.