ఆంధ్రప్రదేశ్‌

శేషాచల కొండల్లో అరుదైన జంతువుల గుర్తింపునకు ప్రత్యేక కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 19: శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లాలో శేషాచల కొండల్లో ఎన్నో అరుదైన జంతువులున్నాయి. 82,500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఏడు కొండల్లో, 2,700 హెక్టార్ల అటవీప్రాంతం మాత్రమే టీటీడీ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలోని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులకు సంబంధించిన తిరుమలకు వచ్చే యాత్రికులకు అవగాహన కల్పించేందుకు టీటీడీ అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీటీడీకి సంబంధించిన అటవీప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుమలలోని పార్వేటి మండపం, శ్రీగంధం వనం, కుమారధార, పసుపుధార డ్యామ్ రోడ్డు, ధర్మగిరి, పాపవినాశనం, శేషాచలం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఈ కెమెరాలను టీటీడీ అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఏవైనా జంతువులు ఈ కెమెరా ముందు వెళ్లినప్పుడు వెంటనే ఆ కెమెరాలు వాటిని ఫోటో తీస్తాయి. దీని ఆధారంగా ఇప్పటి వరకు అత్యంత అరుదైన పునుగుపిల్లి, కొండ గొర్రె, మూషిక గొర్రె, అడవికుక్క, చిరత, ముంగీస, అడివి కోడి, ముళ్లపంది, కణిత, ఎలుగుబంటి ఇతర జంతువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ జంతువులు సంచారం ఉన్న ప్రాంతాల్లో వాటికి సంబంధించిన సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేసి యాత్రికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ డిఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు సోమవారం తెలిపారు. అడవి జంతువుల పరిరక్షణలో భాగంగా వాటికి నీటిని అందుబాటులో ఉంచడం, గడ్డిని పెంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.