ఆంధ్రప్రదేశ్‌

పోశమ్మ అమ్మవారూ పోలవరం నిర్వాసితురాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన గండి పోశమ్మ అమ్మవారి ఆలయం నెలకొనడంతో ప్రస్తుతం అమ్మవారు కూడా నిర్వాసితుల జాబితాలోకి చేరారు. నిర్వాసిత ఆదివాసీ ప్రాంతంలో ఎంతోమంది గ్రామ దేవతలు కొలువైయున్నారు. అందులో ప్రధానమైన గ్రామ దేవత పోశమ్మ తల్లి అమ్మవారు. గొందూరు గ్రామం వద్ద వెలసిన ఈ అమ్మవారి ఆలయం వద్ద గతంలో ఎప్పుడో గోదావరికి గండి పడిందని, అందుకని అమ్మవారు గండి పోశమ్మగా ప్రసిద్ధిచెందారని చెబుతారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గండి పోశమ్మ ఆలయం కూడా ముంపునకు గురవుతుంది. అందువల్ల పోశమ్మతల్లి అమ్మవారు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితురాలే. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని పుట్టినింటికి తరలించాలా, మెట్టినింటికి తరలించాలా అనే అంశంపై వివాదంవుంది. రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఈ ఆలయాన్ని తరలించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు తయారుచేశారు. విశాలమైన ప్రాంగణంలో అన్ని వసతులతో ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు భూమి కేటాయించాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల మాదిరిగానే ఈ అమ్మవారు కూడా సర్వం కోల్పోతున్నారు. ఆలయానికి భూమికి భూమి కేటాయించాలి. గుడి నిర్మించాలి. సమీపంలోనే గొందూరు నిర్వాసిత కాలనీ వుంది. ఆ కాలనీ సమీపంలో ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రతిపాదన వుంది. ఇది మెట్టినిల్లు. అయితే అమ్మవారి పుట్టినిల్లుగా దేవీపట్నం మండలంలోని సీతానుపురం గ్రామాన్ని చెబుతారు. అమ్మవారి ఆలయాన్ని తమ గ్రామానికి తరలించాలని సీతానుపురం వాసులు కోరుతున్నారు. దీనితో తరలింపుపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఆల చరిత్రలోకి వెళితే.. అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతీ ఏటా ఏప్రిల్ మాసంలో వైభవంగా నిర్వహిస్తారు. సంతాన, సౌభాగ్య వరప్రదాయనిగా శ్రీ గండి పోశమ్మ అమ్మవారిని భక్తితో కొలిచే భక్తులకు ఏ గండం, కష్టమూ రాకుండా రక్షిస్తారని ప్రతీతి. గండాలను గట్టెక్కించే తల్లిగా గండి పోశమ్మ అమ్మవారు శతాబ్ధ కాలానికి పైగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో ఒకవైపు గోదావరి, మరోవైపు పర్వత శ్రేణులు, ఇంకోవైపు దట్టమైన అటవీ ప్రాంతం మధ్య వెలిసిన గిరిజన గ్రామ దేవత మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి ఆలయానికి ఒక స్థలపురాణం ప్రాచుర్యంలో వుంది. సీతానుపురం వారి ఇంట ఐదుగురు ఆడబిడ్డల్లో ఒకరు ప్రతీ రోజూ నీటి కోసం గోదావరికి వచ్చే క్రమంలో ఒకరోజు తిరిగి వెళ్ళకుండా ఇక్కడ బంగారు బొమ్మ రూపంలో అమ్మవారిగా వెలిసినట్టు చెబుతారు. ఈ బంగారుతల్లి కుటుంబం వారు వ్యాపార రీత్యా వేరొక చోటకు వెళ్తూ గొందూరు గ్రామానికి చెందిన సోదెవారికి అప్పగించినట్టు చెబుతారు. ఒక సందర్భంలో అమ్మవారి బంగారు బొమ్మను ఒక తాగుబోతు గోదావరి నదిలో విసిరివేయడంతో బయటకు తీయడానికి ప్రయత్నించగా అశరీరవాణి తనను బయటకు తీయవద్దని, అక్కడేవుంచి వీలును బట్టి కొలుచుకోండి అని చెప్పడంతో ఇక అప్పటి నుంచి అమ్మవారిని అక్కడనే కొలుచుకుంటూ కాలక్రమేణా ఆలయాన్ని నిర్మించారు. 1990వ సంవత్సరం ఉగాది నుంచి ఆలయ దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఏప్రిల్ మాసంలో ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని సోదె వారి కుటుంబ సభ్యులు, గొందూరు గ్రామస్థులు గిరిజన సంప్రదాయం మధ్య అమ్మవారిని పుట్టినింటికి తీసుకెళ్ళడం విశేషంగా సాగుతుంది.
అసలు విషయంలోకొస్తే.. ఈ ఆలయాన్ని భక్తులకు అన్ని విధాల సౌకర్యంగా వుండే ప్రాంతానికి తరలించి నిర్వాసిత పరిహారం నేపధ్యంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుత వరదలకు ఆలయం పూర్తిస్థాయిలో మునిగి పోయింది. పది రోజులు ఆలయాన్ని దేవదాయ శాఖ మూసివేసింది. దర్శనాలను రద్దుచేశారు. ఆలయం శిఖరం కాస్తంత కన్పించేంత వరకు ఆలయం మునిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా ఈ ఆలయం కూడా ముందస్తుగానే వరద నీటిలో దిగ్బంధమైంది. సాధారణంగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే సమయంలో కూడా ఈ ఆలయానికి రాకపోకలు వుంటాయి. కానీ ఈ సారి ఎటువంటి ప్రమాద హెచ్చరికలేకుండానే దేవీపట్నం మండలంలో ముంపునకు గురైన గ్రామాల మాదిగానే ఆలయం ముందుస్తుగా జల దిగ్భంధమైంది. ఇక రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చే సరికి ఆలయం పూర్తిగా గోదావరి నది ముంపులోకి చేరింది. నిర్వాసితులతో పాటు గండిపోశమ్మ అమ్మవారి ఆలయాన్ని అనుకూలమైన పునరావాస ప్రాంతానికి తరలించి, అభివృద్ధిచేయాలని భక్తులు కోరుకుంటున్నారు.
చిత్రం...గండి పోశమ్మ అమ్మవారు