ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఆగస్టు 19: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద గణనీయంగా తగ్గిపోవడంతో సోమవారం 8 గేట్లు మూసివేశారు. రెండు గేట్ల ద్వారా 54,774 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు వరకు పది గేట్లు ఎత్తి ఉంచిన అధికారులు వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా గేట్లు మూసివేస్తూ వచ్చారు. జూరాల క్రస్ట్‌గేట్ల ద్వారా 1,63,674 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,630 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 56,910 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,52,214 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. వరద తగ్గడంతో 11 గంటల ప్రాంతంలో ఐదు గేట్లు మూసివేశారు. 4 గంటల ప్రాంతంలో మరో మూడు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 54,774 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32,247 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 42,378 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 34 వేల క్యూసెక్కుల నీరు మళ్లిస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం 1,66,825 క్యూసెక్కుల నీరు బయటకు తరలిస్తున్నారు. ఎగువ నుంచి వరద మరింత తగ్గితే 2 గేట్లు కూడా మూసివేస్తామని అధికారులు తెలిపారు.
చిత్రం...శ్రీశైలం జలాశయంనుంచి 2 గేట్ల ద్వారా వరద నీటిని వదులుతున్న దృశ్యం