ఆంధ్రప్రదేశ్‌

దేవదాసీ వ్యవస్థ సమూలంగా సమసిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: దేవదాసి వ్యవస్థను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపు ఇచ్చారు. స్థానికంగా ఒక హోటల్‌లో మంగళవారం జరిగిన దేవదాసీ వ్యవస్థ నిర్మూలన ప్రణాళిక సదస్సును జ్యోతిని వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవదాసి వ్యవస్థ సాంఘిక దురాచారమని, ఇటువంటి వ్యవస్థను పూర్తిగా రూపుమాపి దేవదాసిలు, జోగినులుగా ఉన్న వారిని జనజీవన స్రవంతిలోనికి తీసుకువచ్చి వారికి సామాజిక న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. జస్టిస్ కేసీ భాను మాట్లాడుతూ రాష్ట్రంలో 80 వేలకు మందికిపైగా దేవదాసీలుగా ఉన్నారని, వీరిలో 80 శాతం మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, 20 శాతం షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారున్నారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా దేవదాసి పిల్లలకు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కే దమయంతి మాట్లాడుతూ దేవదాసీలకు ఆర్థిక చేయూత అందించడం ద్వారానే వారిని ఆ సాంఘిక దురాచారం నుండి బయటకు తీసుకురావచ్చన్నారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం సహకారంతో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఐదువేల మందిని జోగినుల ఆర్థికాభివృద్ధికి కృషి చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారానే దేవదాసీ వ్యవస్థను రూపుమాపవచ్చన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ దేవదాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఒకప్పుడు దేవదాసిగా ఉండి, ఆ వ్యవస్థను ఎదిరించి ప్రస్తుతం దేవదాసీ, జోగినీల సంక్షేమానికి కృషి చేస్తున్న అజమ్మ మాట్లాడుతూ దేవదాసీ పిల్లలకు డీఎస్‌ఏ టెస్ట్ చేయించి వారి తండ్రులను గుర్తించి వారి ఆస్తిలో వాటా హక్కును కల్పించాలన్నారు. జాతీయ హాకీ క్రీడాకారిణి, దేవదాసీ కుమార్తె సుశీల, కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.

చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్