ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్ ఒక శాడిస్టు బాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 20: ఒక ఉద్యోగం ఇచ్చేందుకు పది ఉద్యోగాలను తీసిన ఘనత ఏపీ సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక శాడిస్టు బాస్‌లా ఉన్నారని మంగళవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ ఘాటుగా విమర్శించారు. యానిమేటర్ల జీతాలను నెలకు రూ.10 వేలు చేశామన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వాలంటీర్లను తెచ్చి వాళ్లను వెళ్లిపొమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనగనగా ఒక శాడిస్టు బాస్ తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగిని పిలిచి నీకు జీతం రెట్టిపు చేశా అన్నాడంటా.. అతను సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే నీకింకో విషయం చెప్పాలి.. నిన్ను ఉద్యోగం నుండి తీసేశా అన్నాడంట.. అనే పిట్టకథను లోకేష్ ప్రస్తావించారు. అలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు అని అడిగితే ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి అని బాస్ సమాధానం ఇచ్చాడంటూ సీఎం జగన్ తీరు కూడా అలాగే ఉందన్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి 10 ఉద్యోగాలను తీసేశారని మండిపడ్డ లోకేష్ ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం అంటూ జగన్‌ను నిలదీశారు.