ఆంధ్రప్రదేశ్‌

వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 21: వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సుజాతరావు నేతృత్వంలో నియమించిన కమిటీ తన నివేదికలో పలు కీలకమైన సూచనలు చేసింది. వాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కమిటీ సిఫార్సుల్లో ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న పథకాల అమలుతీరును పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పీపీపీ విధానంలో ప్రారంభమైన పథకాల అమలుతీరు వాటి వల్ల ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్ల సమాచారం. పీపీపీ విధానాన్ని రద్దుచేసిన పక్షంలో వాటిని ఏవిధంగా కొనసాగించాలన్న దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో అమలుచేస్తున్న పథకాల వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదన్న భావనను సుజాతరావు కమిటీ వ్యక్తంచేసినట్టు తెలిసింది.ఆయా సేవలను అందిస్తున్నందుకు భారీ మొత్తాన్ని సదరు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా ఆయా సంస్థలకు చెల్లించే మొత్తాలతో ప్రభుత్వమే ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశముందని, వీరి వల్ల ప్రభుత్వాసుపత్రిలో సదుపాయాలు మెరుగుపడతాయని సుజాతరావు కమిటీ సూచించినట్టు తెలిసింది. ఈ నివేదిక పూర్తిగా అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పీపీపీ విధానంలో అమలుచేస్తున్న పథకాలు, ఆయా సంస్థలు అందిస్తున్న సేవలు, ఏటా చెల్లిస్తున్న మొత్తం తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి దశలవారీగా ఆయా సంస్థలను తొలగించి పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. వైద్య ఆరోగ్యశాఖలో పీపీపీ విధానంలో పలు పథకాలు అమలవుతున్నాయి. వీటిలో ఆరోగ్య కేంద్రాలు, సీఎం నేత్ర కేంద్రాలు, సురక్ష ఆసుపత్రి పరికరాల నిర్వహణ, పీహెచ్‌సీలో పలు పరీక్షల నిర్వహణకు మెడాల్, ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ సెంటర్, కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేసేందుకు లెప్రోస్కోప్ వంటి సేవలను అనేక ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్నారు. వీటన్నింటినీ దశలవారీగా నిలిపివేసి, ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.