ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 22: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం విమర్శించారు. నెల్లూరులోని ఆదిత్యనగర్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రభుత్వ నోటీసును డిస్మిస్ చేసి కాంట్రాక్టు సంస్థను కొనసాగించమని కోర్టు ఆదేశించడం చిన్న విషయం కాదన్నారు. రెండున్నర నెలల పాలన కాలంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న విపరీత నిర్ణయాలకు కోర్టు తీర్పు శరాఘాతం లాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మారినా పాలన కొనసాగాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కోపంతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఆగిపోవాలనుకోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు. పోలవరం ఆగిపోవాలా, రాజధాని ఆగిపోవాలా, ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోవాలా, సంస్థలన్నీ మూసేసుకోవాలా, ఓడరేవులు అమ్మేసుకునే పరిస్థితులు రావాలా అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉండటం సిగ్గు చేటన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది అన్ని రంగాల్లో వృద్దిరేటు పడిపోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 151 సీట్లతో ప్రజలు అద్భుత విజయంతో వైసీపీకి అధికారం ఇచ్చారని గత ప్రభుత్వంకంటే మంచిపాలన అందించమని ప్రజలు ఓటువేశారని, కాబట్టి వైసీపీ నేతలు ప్రశాంతంగా సౌకర్యవంతంగా మంచి పాలన అందించాలని హితవు పలికారు.