ఆంధ్రప్రదేశ్‌

అమరావతిని మార్చే ప్రసక్తేలేదు: గౌతంరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఆగస్టు 22 : రాజధానిని అమరావతి నుండి మార్చే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని వాశిలి, నెల్లూరుపాళెం, వెన్నవాడ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరుపాళెంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమరావతి మార్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు వక్రీకరించారన్నారు. అమరావతి లోతట్టు ప్రాంతమని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రి బొత్స ప్రస్తావించారన్నారు. ప్రస్తుతం కృష్ణా నదికి వస్తున్న వరద కారణంగా అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుంటున్న ముంపు సంఘటనలే అందుకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొటున్న ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీ ఎం చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అధికారం కోల్పోయిన వత్తిడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అందులో వారి తప్పేమీ లేదని చమత్కరించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల వలంటీరు, 1.37 లక్షమల మందికి గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వీరందరికీ సుమారు రూ. 2500 కోట్ల మేర వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా సాహసమనే చెప్పాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ తాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. అందుకు ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నామన్నారు. తెలంగాణలోని మిషన్ భగీరథ పథకం మాదిరి సోమశిల వద్ద గ్రిడ్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ మంచినీరు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.