ఆంధ్రప్రదేశ్‌

చంద్రన్న బీమా సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 20: చంద్రన్న బీమా పథకం దేశంలోనే అతిపెద్ద బీమా పథకం అని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ వి. వరప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో శనివారం రాష్ట్రంలోని ఐదు జిల్లాల కార్మికశాఖాధికారులతో చంద్రన్నబీమా నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో 5కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో 2 కోట్లమంది అసంఘటిత కార్మికులు ఉన్నారన్నారు. వీరి ప్రయోజనం కోసం ఆమ్‌అద్మీబీమా, సురక్షభీమా యోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా సాధికార సర్వేలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల పేర్లను నమోదుచేయాలన్నారు. సెప్టెంబర్ 18లోపు కార్మికుల పూర్తివివరాలను సేకరిస్తామన్నారు. దాదాపు రాష్ట్రంలో 27 కార్మిక సంఘాలున్నాయన్నారు. వారందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలుచేయిస్తామన్నారు. చంద్రన్న బీమా సెప్టెంబర్ -2016నుంచి పెద్ద ఎత్తున అమలుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే కార్మిక జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చేతులమీదుగా బీమా పాలసీ పత్రాలు అందజేయడానికి రూపకల్పన చేస్తున్నామన్నారు.