ఆంధ్రప్రదేశ్‌

సాగర గర్భంలో ఖనిజాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నీలి ఆర్థిక ప్రణాళిక (బ్లూ ఎకానమి ఇనీషియేటివ్)లో భాగంగా ఖనిజ నిక్షేపాలు, శక్తి వనరుల కోసం సాగర మథనాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఎర్త్‌సైన్స్ విభాగం కార్యదర్శి మాధవన్ నాయర్ రాజీవన్(ఎంఎన్ రాజీవన్) వెల్లడించారు. విశాఖలో గీతం యూనివర్శిటీ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజీవన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన గీతం యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి మట్లాడారు. కావరెట్టి సమీపంలో ఏర్పాటు చేసిన ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాంట్ ద్వారా రోజుకు లక్ష లీటర్ల ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, 2019 నాటికి దీని సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరప్రాంత గ్రామాలకు ఇది వరప్రదాయినిగా అభివర్ణించారు. సముద్ర అగాథాల నుంచి ఖనిజాలను వెలికితీసే నూతన సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. సముద్ర గర్భంలో నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపేందుకు భారత్ ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుమతి తీసుకుందన్నారు. తద్వారా 75వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 4 నుంచి 6 వేల సముద్ర అగాథాలో పాలిమెటాలిక్ నోడ్యూల్స్ తవ్వేందుకు అవకాశం దక్కిందన్నారు. దీని వల్ల కాపర్, నికిల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి ఖనిజాలు లభిస్తాయన్నారు. సముద్ర గర్భం వనరుల కోసం అధ్యయనం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తదుపరి చర్యగా హిమాలయాలు, అర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లో కూడా పరిశోధనలకు శాస్తవ్రేత్తల బృందం పనిచేస్తోందన్నారు. సముద్రంలో మత్స్య సంపద సమృద్ధిగా లభించే ప్రాంతాలను గుర్తించడంతో పాటు సునామీ వంటి ఉపద్రవాలను ముందుగానే పసిగట్టే హెచ్చరించే శాస్ర్తియ పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు సాగుతున్నాయన్నారు.
ఇళయరాజాకు డిలిట్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు గీతం విశ్వవిద్యాలయం డిలిట్ ప్రదానం చేసింది. తమిళనాడు సహా భారత ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించిన ఇళయరాజాను తాజాగా గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

చిత్రం.. ఇళయరాజాకు డిలిట్ ప్రదానం చేస్తున్న దృశ్యం