ఆంధ్రప్రదేశ్‌

పదేళ్ల తరువాత కలిసిన భార్యాభర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, ఆగస్టు 24: ఓ ఆర్మీ జవాన్ సాయంతో పదేళ్ల తరువాత కుటుంబసభ్యుల చెంతకు చేరింది మతిస్థిమితం లేని ఉత్తరప్రదేశ్ మహిళ. అనంతపురం జిల్లా కొత్తచెరువుకు మండలం తలమర్లకు చెందిన ఆర్మీ జవాన్ రాజశేఖర్‌రెడ్డి ఆమె వివరాలు సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు అక్కడి తన స్నేహితుల ద్వారా ఆమె కుటుంబసభ్యులను గుర్తించగలిగాడు. శనివారం ఆమెను భర్త చెంతకు చేర్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామంలో మతిస్థిమితం లేని ఓ మహిళ గత పదేళ్లుగా ఉంటోంది. ఇది గమనించిన ఆర్మీ జవాన్ రాజశేఖర్‌రెడ్డి ఆమె గురించి ఆరా తీశాడు. ఆమె పేరు రామ్‌ప్యారీ(52) అని ఆమె భర్త పేరు కాంతిప్రసాద్ అని తెలుసుకున్నాడు. వీరి స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు గ్రహించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని తన స్నేహితులకు చేరవేశాడు. అక్కడి వారు సోషల్ మీడియాలో ఉంచగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ దృష్టికి ఈవిషయం వెళ్లింది. ఫతేపూర్ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ దీనిపై దృష్టి సారించారు. పోలీసుస్టేషన్ పరిధిలోని సాహిలి గ్రామానికి చెందిన మహిళగా ఈమెను గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులు ఆమె భర్తకు విషయాన్ని చేరవేశారు. అనంతరం కొత్తచెరువు పోలీసులకు సమాచారం అందించారు. 10 సంవత్సరాల క్రితం రామ్‌ప్యారీకి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి తీసుకువెళ్లగా పారిపోయిందని భర్త కాంతిప్రసాద్ తెలిపారు. దీంతో కొత్తచెరువు రమ్మని పోలీసులు కబురుపెట్టడంతో శనివారం తన కుమారుడితో పాటు చేరుకున్నాడు. భార్యను చూసి కాంతిప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. కొడుకు సాయంతో భార్యను వెంట తీసుకువెళ్లాడు. 10 సంవత్సరాల తర్వాత భార్యభర్తలను కలిపిన ఆర్మీ జవాన్ రాజశేఖర్‌రెడ్డిని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అభినందించారు.