ఆంధ్రప్రదేశ్‌

ప్రజా చైతన్యంలో పార్టీలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: ప్రజలను చైతన్య పరిచే విషయంలో రాజకీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని, అసలు ఈ అంశానే్న అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా మర్చిపోయాయని సీనియర్ పాత్రికేయులు ఆర్వీ రామారావు అభిప్రాయపడ్డారు. పౌర గ్రంధాలయంలో భారత రాజకీయ వ్యవస్థ అనే అంశంపై శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే విధానంలో బీజేపీదే పైచేయిగా పేర్కొన్నారు. ప్రజల మనసు ఆకట్టుకునే విధానాలతో ఆరెస్సెస్ కొన్ని వర్గాల ప్రజలను విలన్లుగా చూపి లబ్ధి పొందిందన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయని, అయితే సంఘ్ పరివార్‌కు అనుబంధ సంఘంగా బీజేపీ రాజకీయ పార్టీ అవతారం దాల్చిందన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో తొలి సారిగా 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి రాజకీయ పార్టీల్లో ప్రజల భాగస్వామ్యం ప్రారంభమైందన్నారు. 1915లో ఏర్పడిన హిందూమహాసభ రాజకీయ పక్షంగా రూపుదిద్దుకోగా, 1925 కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి రాజకీయంగా వేళ్లూనుకుందన్నారు. దేశంలో 1960వ దశకం తరువాతే ప్రాంతీయ పార్టీల హవా మొదలైందన్నారు. అంతకు ముందు 1950 జనసంఘ్ ఏర్పాటు జరిగినప్పటికీ దీని మూలాలు హిందూమహా సభకే చెందుతాయని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న భారత్‌లో ఓటు హక్కు కలిగి ఉండటం, నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేయడం ఒక్కటే ప్రజాస్వామ్యంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్లకోసారి ఓటేసి గెలిపించుకున్న నాయకుడు అవినీతిపరుడై, ఇతర పార్టీలకు అమ్ముడుపోతే పునీతుడైనట్టుగానే రాజకీయ వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రజలను అవినీతి పరులుగా మార్చేందుకే రాజకీయ వ్యవస్థ నిలిచిపోయిందన్నారు.

చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న సీనియర్ పాత్రికేయుడు ఆర్వీ రామారావు