ఆంధ్రప్రదేశ్‌

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న బీజేపీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 24: పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేంద్రానికి నివేదిక సమర్పించడానికి బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనుంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహం, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతృత్వంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మరికొందరు ముఖ్య నాయకులు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మరోవైపు 25 నుంచి 31వ తేదీ వరకు నేషనల్ ట్రైబల్ కమిషన్ బృందం పోలవరం నిర్వాసిత ప్రాంతంలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు పర్యటించి నిర్వాసితుల స్థితిగతులను తెలుసుకోనున్నారు. పోలవరం నిర్వాసితులను కలుసుకోవడంతో పాటు కుకునూరు, వేలేరుపాడు, దేవీపట్నం, చింతూరు, కూనవరం, ఎటపాక, వర రామచంద్రపురం మండలాల్లో బృందం పర్యటించనుంది.