ఆంధ్రప్రదేశ్‌

మెడికల్ కౌనె్సలింగ్‌లో కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: రాష్ట్రంలో మెడికల్ కౌనె్సలింగ్ జీవో నంబర్ 550ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాలని ఆదివారం నగరంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. మెడికల్ కౌనె్సలింగ్‌లో జీవో నంబర్ 550ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని దాసరి భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సీట్లు లభించకుండా ఓపెన్ కేటగిరిలో కేటాయించడం దారుణమన్నారు. జీవో నంబర్ 550ను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీ రావు, సహాయ రిజిస్ట్రార్ అనూరాధను వెంటనే సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు మందలించినా అధికారుల్లో మార్పు రావడంలేదని, తప్పును సరిదిద్దుకోవడం లేదన్నారు. దళిత హక్కుల పోరాట సమితి, కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కరవది సుబ్బారావు, ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ మెడికల్ కౌనె్సలింగ్‌లో అణగారిన వర్గాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై రాజకీయ ఎజెండాగా చర్చ జరిగితేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ రంగన్న అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు, బీసీ సంఘం నేత అప్పారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జీ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేత రామకృష్ణ