ఆంధ్రప్రదేశ్‌

హమ్మయ్య.. ఇనుప బోటు బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: నాలుగు రోజుల పాటు రాత్రీ పగలు జలవనరుల శాఖ ఇంజనీర్లను కంటిపై కునుకు లేకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన ఐరన్ బోట్ ఎట్టకేలకు ఆదివారం బయటపడింది. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 70గేట్లలో 69 గేట్లను పూర్తిగా మూసివేసినప్పటికీ 68వ గేటు వద్ద ఐరన్ బోటు చిక్కుకున్న కారణంగా మూతబడక పోవటంతో 5,600 క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 11.6 అడుగులకు పడిపోయి ఆందోళన కలిగించింది. దీంతో శనివారం ఒక్కసారిగా పట్టిసీమ వద్ద 21 మోటార్లను ఆన్ చేసి డెల్టాకు నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నానికి పడవ వెలుపలకు వచ్చి గేటు మూతబడినప్పటికీ రాత్రి 7గంటల వరకు కూడా మోటార్లు పనిచేశాయి.
ప్రస్తుతం 3,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతుండగా కాలువలన్నింటికీ కలిపి 16,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భారీగా వరద వచ్చే సమయంలో డ్రోన్లను ఉపయోగించిన అధికారులు నతీరంలో నిలిచిన ఇనుప బోటును ముందుగా గుర్తించి దూరంగా ఎందుకు నెట్టలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రోన్ సహాయంతో కరకట్ట పక్కన ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి ప్రాంగణం మొత్తాన్ని మాత్రం అడుగడుగునా పరిశీలించారు. ఇక ఐరన్ బోటును వెలుపలకు లాగటానికి ఉపయోగించిన అనేక తాళ్లు తెగిపోయాయి. చివరికి 100 టన్నుల బరువును లాగే సామర్థ్యం కలిగిన ఐరన్ మేకు కూడా విరిగిపోయింది. కాకినాడ నుంచి వచ్చిన నరసింహరాజు బృందం ఐదారు గంటలు శ్రమించి ఎట్టకేలకు ఐరన్ బోటును బయటపడేశారు.
చిత్రం...వరదలకు ప్రకాశం బ్యారేజీ ఖానాలో చిక్కుకుని ఎట్టకేలకు బయటపడిన ఇనుప బోటు