ఆంధ్రప్రదేశ్‌

భిక్షాటనతో అర్చకుల వినూత్న నిరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లాలోని ప్రధాన దేవాలయాల అర్చకులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అర్చకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అర్చకులంతా భిక్షాటనతో నిరసన నిర్వహించారు. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస, ఉమారుద్ర కోటేశ్వర ఆలయాల అర్చకులు దేవాదాయశాఖ అనుచిత వైఖరి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిరసనగా ఉత్తరాంధ్ర అర్చక సంఘం సూచన మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేసారు. నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ అర్చకులు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. పిఆర్‌సి అమలు చేయాలని, కనీస వేతనాలు సక్రమంగా చెల్లించాలంటూ నగరంలో పలుచోట్ల భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రిని గతంలో కలిసి వినతిపత్రం సమర్పించామని, అయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళన బాట పట్టామని సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు, సహాయ కార్యదర్శి కొప్పలంక మురళీకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 15లోగా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆలయాల్లో ఆర్జితసేవలు నిలిపివేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అనేక అవరోధాలు కలిగించడం వల్ల అర్చక కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయన్నారు. అధ్యయనం సాకుతో కాలయాపన చేస్తూ అనేక కష్టాల్లో జీవనం గడుపుతున్న అర్చకులను ప్రభుత్వం మోసగిస్తోందని ఆరోపించారు.