ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో పుష్కఠ కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 22: కృష్ణానది పుష్కరాల సందర్బంగా 11వ రోజైన సోమవారం భక్తుల రద్దీ కొనసాగింది. కర్నూలు జిల్లాలో 1.80 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనావేశారు. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు పుష్కరఘాట్లలో సుమారు 1.30 లక్షల మంది, సంగమేశ్వరంలో 30 వేల మంది, నెహ్రూనగర్, ముచ్చుమర్రి గ్రామాల్లో 20 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు లెక్కలు గట్టారు. పలువురు తమ పితృదేవతలకు పిండప్రదానం చేసిన అనంతరం తమ ఇష్టదైవాలకు పూజలు జరిపారు. గత 6 రోజులుగా భక్తుల సంఖ్య ప్రతిరోజు లక్షకు మించగా, గరిష్ఠంగా 10వ రోజు ఆదివారం 2.80 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీ తట్టుకునేందుకు మొదటి సారిగా అర్థరాత్రి వరకు పుష్కరఘాట్లలో స్నానాలకు అనుమతించారు. 11వ రోజైన సోమవారం భక్తుల రద్దీ కొనసాగగా సాయంకాలం లింగాలగట్టు వద్ద నదీమతల్లికి హారతి కార్యక్రమం నిర్వహించారు. చివరిరోజు మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుందని అంచనా వేసిన కలెక్టర్ విజయమోహన్ ఆమేరకు అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా జిల్లాలో పుష్కరవిధులు నిర్వహించిన ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పనిని అంకితభావంతో చేయడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. మరో వైపు శ్రీశైలం ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుతీరిన భక్తుల రద్దీని ఇఓ భరత్ నారాయణ గుప్త నిత్యం పర్యవేక్షిస్తూ దర్శన సమయం సాధ్యమైనంత తక్కువగా వుండేలా ప్రణాళిక రూపొందించారు. పుష్కరోత్సవాల చివరి రోజైన మంగళవారం సాయంకాలం 1116 మంది దంపతులతో పాతాళగంగ నుండి పుష్కర జలాలు తీసుకువచ్చి మల్లికార్జునస్వామికి కలశాభిషేకం జరుపనున్నారు.

చిత్రం..సంగమేశ్వరం స్నానఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు