ఆంధ్రప్రదేశ్‌

ఇంటింటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.8500 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని రాష్ట్ర డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల కాళీ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి డిప్యూటీ సీఎం బోస్, ఇన్‌చార్జి మంత్రి ఆళ్ళ నాని రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ప్రతీ గ్రామానికి స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు రూ.45 వేల కోట్లతో బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు. ప్రతి గ్రామానికి పైపులైన్‌లు ద్వారా మంచినీరు అందించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అధికారులు అంచనా వేశారన్నారు. ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందుతుందన్నారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో మంచినీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారం ప్రభుత్వ అధికారులే డిజైన్, అంచనాలు తయారు చేశారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల పెంపకాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, కాబట్టి ఈ వాటర్ గ్రిడ్‌కు అత్యంత ప్రాధాన్యత వుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాత నీటి వనరులను వినియోగించుకుంటేనే ఈ కొత్త పథకాన్ని ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖ
మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గ్రిడ్‌కు సంబంధించి గోదావరి చెంతనే ఫిల్టర్‌బెడ్ ఏర్పాటు చేసుకోవాలా, లేకుంటే రా వాటర్ తీసుకెళ్లి అవసరమైన చోట ఫిల్టర్ బెడ్‌లు ఏర్పాటు చేసుకోవాలా అన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ వాటర్ గ్రిడ్‌కు సంబంధించి సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లను, నిర్వహణ ఖర్చులకు సంబంధించి కూడా అధ్యయనం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద 365 రోజుల పాటు నీరు అందుబాటులో ఉంటుంది కనుక అక్కడే ఫిల్టరేషన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే విధంగా విధంగా ప్రాజెక్టు రూపొందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి ముందుగా డ్రెయినేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసిన తర్వాత వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేస్తే బావుంటుందన్నారు. ఎంపీలు వంగా గీతా విశ్వనాధ్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పర్వత ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, తెల్లం బాలరాజు, జీవీ ఎస్ నాయుడు, కొఠారి అప్పయ్య చౌదరి, గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్‌కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిత్రం...సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బోస్, పక్కన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని