ఆంధ్రప్రదేశ్‌

అప్రజాస్వామిక పాలనపై రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచకంగా, దుర్మార్గంగా రాక్షస పాలన చూడలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తూ తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి హింసిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతూ కార్యకర్తలే లక్ష్యంగా వేధిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలోనైనా వైసీపీ దౌర్జన్యాల గురించి చెప్తుంటే అక్కడ కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై 565 ఘటనలు జరిగాయని, వీటిలో 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 22 ఉద్యోగాల తొలగింపులు, 15 భూ కబ్జాలు, 66 ఆస్తుల అన్యాక్రాంతం, 10 హత్యలు, 28 వ్యక్తిగత దాడులు, సోషల్ మీడియాలో 28 మందిపై కేసులు బనాయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేధింపులు భరించలేక 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ బాధితులు ఎక్కువగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో పినె్నల్లిలో 164, మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులో 127 కుటుంబాలు, జంగమేశ్వరపాడులో 74 కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్లాయని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో ఆత్మకూరు ఆగదని చంద్రబాబు స్పష్టంచేశారు. తమ పాలనలో ఏదో పల్నాడుని దోచేసుకున్నామని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం తప్ప వాస్తవం లేదని, వైసీపీ నేతలు ఊరేగింపుగా ఆత్మకూరు పర్యటనకు వస్తున్నారని, తాము మాత్రం నిజమైన బాధితుల పక్షాన గోడు తెలియజేసి, వారి సొంత గృహాల్లోకి వారిని చేర్చేందుకే వెళ్తున్నామని వివరించారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు