ఆంధ్రప్రదేశ్‌

అర్హతలున్న వారిని ఎందుకు తొలగిస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని మంగళవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ ఆరోపించారు. ఎస్వీయూలో అన్ని అర్హతలున్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను యూనివర్సిటీలోకి పంపే ప్రయత్నంలో భాగంగానే ఏపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో అన్ని అర్హతలు ఉండి, గత ఆరేళ్లుగా విధుల్లో ఉన్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ నిలదీశారు. మీకు కావాల్సిన ఓ సామాజిక వర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా అంటూ లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలను అక్రమ మార్గంలో విశ్వవిద్యాలయంలోనికి పంపించి ఉపాధి కల్పిస్తున్నారని, ఏ కారణంతో పాత వారిని తీసివేశారో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల సాయంతో విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర విద్యాలయాలను కూడా మీ కుల రాజకీయాలతో ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారని నిలదీశారు. మీ ఇష్టం వచ్చినట్లు అక్రమాలు చేస్తుంటే సామాన్యుడు ప్రశ్నించకూడదా అన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తాం అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.