ఆంధ్రప్రదేశ్‌

సొంత ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏటా 10వేల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: సొంత ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారిని సాలీనా పదివేలు సహాయం ఇస్తానంటూ వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు పూర్తయి ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి మొవ్వా తిరుమల కృష్ణబాబు మంగళవారం తమశాఖ ఉన్నతాధికారులతో ఈ విషయమై విస్తృతంగా చర్చించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ పథకం కింద మొత్తంపై నాలుగు లక్షల మంది లబ్ధి పొందనున్నారు. తొలి ఏడాదికి రూ.400 కోట్లు కేటాయించారు. అర్హులైన వారిని గుర్తించేందుకు రవాణాశాఖ కసరత్తు పూర్తి చేసింది. 2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో ఆరు లక్షల 63వేల ఆటోలు, ట్యాక్సీలు ఉండగా వీటిలో వచ్చిన దరఖాస్తులను గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌లు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం 10వేలను వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తారు. ప్రస్తుతం భార్య, భర్తను ఓ యూనిట్‌గా తీసుకుని సాయం అందిస్తారు. కొడుకు, కుమార్తె ఇదే వృత్తిలో ఉండి వివాహం కాకున్నా... మేజర్లు అయితే మరో యూనిట్‌గా పరిగణించి వారికి కూడా సాయం అందిస్తారు.