ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: నిర్బంధాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లో ప్రతిపక్షం గొంతునొక్కలేరని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గృహినిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేయడం, రాష్టవ్య్రాప్తంగా నేతలు, కార్యకర్తల అరెస్ట్ చేసి, అడ్డుకున్న తీరుపై వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. తన నిర్బంధాన్ని నిరసిస్తూ నిరాహార దీక్షకు చంద్రబాబు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తనను గృహనిర్బంధం చేశారని, కార్యక్రమానికి వచ్చే తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఒక పోలీసుస్టేషన్ నుండి మరో పోలీసుస్టేషన్‌కు తిప్పడం ఎంతవరకు సమంజసం అంటూ
పోలీసులను నిలదీశారు. ఆత్మకూరుకు సంబంధించి 120 ఎస్సీ కుటుంబాలు పునరావాస శిబిరంలో ఉంటే అక్కడికి భోజనాలను కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు అత్యుత్సాహంతో ఇష్టమొచ్చినట్లు ప్రవరిస్తున్నారని, ఈ ఘటనలన్నీ పాలించే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. చరిత్రలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని, తనను ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో చూస్తానంటూ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలు చేయాలని హితవుపలికారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించడం ఒక్క వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం తాము పోరాడుతున్నామని, సొంత ఊరిలో నివశించే హక్కు కోసం తాము చేస్తున్న ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మొత్తం 580 బాధిత కుటుంబాలను వారి వారి గృహాలకు తరలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. సమాజంలో మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, ఆస్తి, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు మంగళవారం వరకు గడువు ఇచ్చామని, బుధవారం ఛలో ఆత్మకూరుకు బయలుదేరితే అడ్డుకోవడం గర్హనీయమన్నారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోలేరని, ఏరోజుకైనా ఆత్మకూరు, పినె్నల్లి గ్రామాలకు వెళ్లి తీరుతామని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని చంద్రబాబు పేర్కొన్నారు.
చిత్రం... గృహ నిర్బంధంలో మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు