ఆంధ్రప్రదేశ్‌

ఒకే నమూనాలో సచివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: గ్రామ, వార్డు సచివాలయాలు ఒకే నమూనాలో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాల కల్పన ఓ చారిత్రాత్మక ఘట్టమని, వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటేనే సత్ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో గ్రామ, వార్డు సచివాలయాల గురించి అధికారులతో సమీక్షించారు. గ్రామ సచివాలయాలను రాష్ట్ర సెక్రటేరియట్‌తో అనుసంధానం చేయాలని నిర్దేశించారు. దీనివల్ల ఫిర్యాదులు, దరఖాస్తులు నేరుగా కార్యదర్శులు పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు. సచివాలయాల్లో వౌలిక వసతులు, ఉద్యోగుల జాబ్‌చార్ట్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ నియామకపు పరీక్షలు, కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు సహకారాన్ని అందించాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వివరించారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.గ్రామ సచివాలయాలు, వలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించేందుకు 1902 కాల్ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలపై స్థానికంగా స్పందించటానికి గ్రామ సచివాలయాలకు ప్రత్యేకంగా ఒక నెంబర్ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు ఇంత పెద్దఎత్తున పరీక్షలు ఎప్పుడూ నిర్వహించ లేదన్నారు. ఈ నెలాఖరులోగా పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. 72 గంటల్లోగా సమస్యలు తీర్చటానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో డేటా సెంటర్ కూడా ఉండాలన్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి విచారణ జరపాలన్నారు. గ్రామ సెక్రటేరియట్ నుంచి సంబంధిత శాఖాధిపతిని అప్రమత్తం చేసేలా వ్యవస్థ రూపు దిద్దుకోవాలన్నారు. తహశీల్దారు, ఎండీఓ, కలెక్టర్, సంబంధిత శాఖల కార్యదర్శులు అందరితో అనుసంధానం కావాలన్నారు. జాబ్ చార్ట్ ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన విధులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా తోడ్పాటునందించేలా చూడాలన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాలు గ్రామ వలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ ముఖ్యమన్నారు. నాలుగు లక్షల మందితో పనిచేయించుకోవటం ప్రాధాన్యతాంశమని చెప్తూ ఈ వ్యవస్థ కోసం అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఇళ్ల స్థలాలపై వలంటీర్ల సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికపై
ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఒకే నమూనాలో ఉండాలని సూచించారు. ప్రతి గ్రామ సచివాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులోకి తెచ్చేందుకు ఒక షాపు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి సేద్యం, వ్యవసాయ విధానాలపై సచివాలయాల్లో రైతులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ఏ పథకాన్ని అయినా సరే సాంకేతిక కారణాలతో అధికారులు నిరాకరించరాదని స్పష్టం చేశారు. పారదర్శక విధానంలో పథకాన్ని లబ్ధిదారులకు అందించేందుకు సాంకేతిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా 237 సేవలు అందించాలని, 72 గంటల్లోగా అందే సర్వీస్‌లు 115 కాగా మిగిలినని ఎప్పటిలోగా పరిష్కరిస్తామనేది వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు ప్రణాళికను సమీక్షించారు. డిసెంబర్‌లో కొత్త దరఖాస్తుదారులకు పింఛన్లు అందజేయాలని ఆదేశించారు.

చిత్రం... సచివాలయ ఉద్యోగుల జాబ్‌చార్ట్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారులు