ఆంధ్రప్రదేశ్‌

ఆర్టికల్ 370 రద్దుతో నూతనాధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దుచేయడం ద్వారా అక్కడ నూతనాధ్యాయం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. నగరంలోని వేదిక కనె్వన్షన్ హాలులో బుధవారం రాత్రి శ్రీ గోపాలరావు ఠాగూర్‌జీ స్మారక సమితి ఆధ్వర్యంలో 370 అధికరణం రద్దుపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. 370 అధికరణం మనదేశ సమగ్రత, సమైక్యత, జమ్మూకశ్మీర్ అభివృద్ధి, భద్రతకు ఆటంకంగా మారిందన్నారు. తాత్కాలికంగా ప్రవేశపెట్టిన ఈ అధికరణాన్ని తొలగించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదని, కాని అధికారంలోకి వచ్చిన 70రోజుల్లోనే తొలగించిన సమర్ధవంతుడైన నాయకుడు ప్రధాని మోదీ అని ఆయనన్నారు. అయితే 70ఏళ్లుగా పడిన బాధలు, సమస్యలు, కశ్మీర్‌లో బీజేపీ మూడేళ్ల భాగస్వామ్య పాలన పరిశీలించిన కశ్మీరీలు 370 అధికరణం రద్దు విషయాన్ని ఆలోచించి ఇది తమ మేలుకోసమే చేసిన నిర్ణయంగా భావించారన్నారు. అధికారణం 370ని రద్దుచేసిన ఐదు వారాలుగా అక్కడ ఎలాంటి ఘర్షణలు, హింసాత్మక సంఘటనలు, ప్రాణ, ఆస్తినష్టాలు జరగలేదని ఆయన ఉదహరించారు. ఈ అధికరణాన్ని రద్దుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కుహనా మేధావులకు అసలు దీనిగురించే తెలియదని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ట్రిపుల్ తలాక్ నిషేధం బిల్లు తెచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేశామని రామ్‌మాధవ్ వివరించారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు 2014లో ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన రామ్‌మాధవ్ అక్కడ పార్టీ జెండాను ఎగురవేసే స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా చేర్చేలా 370 అధికరణం రద్దుకు అవసరమైన విధానానికి రూపకల్పన చేయటంలో కృషి చేశారన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘురామ్ వర్మ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకురాలు శాంతారెడ్డి, సినీనటి కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, తదితరులు పాల్గొన్నారు.